Power of Bhagavan’s Name and Form (Telugu)

This entry is part 2 of 5 in the series Bhagavan's Name & Form (Telugu)
2 minute read

దేవుని పేరు మరియు రూపం యొక్క శక్తి

పూజ్యపాద్ పూరి శంకరాచార్యగారు భగవంతుడిని నామరూపంలో ఎందుకు పూజించాలో వివరించారు. ఈ వ్యాసంలో, ఆయన దేవుని యొక్క పేరు మరియు రూపం వెనుక ఉన్న శక్తి గురించి చేయడానికి ఉదాహరణలను ఇచ్చారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక ఎదుగుదల కోరుకునే వారికి ఇది చాలా శ్రద్ధ వహించాల్సిన విషయం.

దేవుని స్వరూపం యొక్క శక్తి

భీష్మ ఇతమహుడు తమ శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందుకు సాగారు.

శ్రీ కృష్ణుడు చెప్పారు, “పాండవులారా, మీ పితామహుడు తమ శరీరాన్ని విడిచిపెట్టబోతున్నారు. మనం వెళ్లి ఆయన దర్శనం చేద్దాం.”

భీష్మ పితామహుడు కౌరవులు మరియు పాండవుల బంధువు కాబట్టి యొద్ధంలో విరామం ఏర్పడింది.

శ్రీ కృష్ణుడు వచ్చారని భీష్ముడికి తెలియగానే, “పర్భూ, నేను బాణపు మంచం మీద పడుకున్నందున నీవు దర్శనం ఇవ్వడం భాగ్యకరమైనది. దయచేసి నా కళ్ల ముందు నిలబడి ఉండండి. మీ మధురమైన రూపాన్ని చూసి, మీ దివ్య స్వరూపాన్ని దర్శిస్తూ నా దేహాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను.”

భగవాన్ శ్రీ కృష్ణుడు అంగీకారంతో ప్రతిస్పందించారు.

శ్రీ కృష్ణుడి దివ్య రూప దర్శనం తరవాత భీష్ముడు చివరకు తమ శరీరాన్ని విడిచిపెట్టారు.

దేవుని యొక్క దివ్య రూపం ఎంత ముఖ్యమైనదో ఈ కథ కథ ద్వారా మనకి తెలుస్తుంది. భీష్మ పితామహుడు కూడా భగవాన్ శ్రీ కృష్ణ స్వరూపాన్ని చూస్తూ తన మర్త్య శరీరాన్ని విడిచిపెట్టాలని కోరుకున్నాడు.

భగవంతుని పేరు యొక్క శక్తి

భగవంతుని పేరులో అపురూపమైన శక్తి ఉంది. పూజ్యపాద్ పూరీ శంకరాచార్యగారు  దీనిని సరళంగా వివరించడానికి ఒక ఉదాహరణ ఇచ్చారు.

ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం అతని పేరును పిలిచినప్పుడు, అతను మేల్కొంటాడు. ఇక్కడ మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది: వ్యక్తి తన పేరు వినగానే నిద్ర లేస్తాడా లేదా నిద్రలేచిన తర్వాత అతను తన పేరు వింటాడా? అతని పేరు వినగానే నిద్ర లేచానడంటే తను అసలు నిద్ర పోనేలేదు, అదే నిద్ర లేచిన తర్వాత పేరు వినుంటే ఆ పిలుపు అతనిని నిద్ర నుండి లేపినది కాదు.

సమాధానం ఏమిటంటే, నిద్రపోతున్న వ్యక్తి తన పేరును పిలవడం వింటూ మేల్కొంటాడు. వ్యక్తి యొక్క పేరు, అది ఎలా ఉన్నా, అది అతనిని గాఢమైన నిద్ర నుండి మేల్కొల్పగల శక్తిని కలిగి ఉంటుంది.

ఇప్పుడు ఊహించండి, ఒక సాధారణ వ్యక్తి పేరుకి అలాంటి శక్తి ఉంటే, దేవుని యొక్క దివ్య నామం – రాముడు, కృష్ణుడు మొదలైనవాటి శక్తి ఎలా ఉంటుంది?

బ్రహ్మసూత్రంలో, “భూ” అనే వేద పదాన్ని స్మరించుకోవడం ద్వారా, భగవంతునిచే భూమి ఎలా సృష్టించబడిందో వివరించబడింది.

పదాలు లేకుండా ప్రపంచంలో ఉన్న వాటి గురించి సంభాషించడం లేదా ఏదైనా తెలుసుకోవడం అసాధ్యం. పదాలు లేకుండా మనం ఏ ఆలోచన, జ్ఞాపకం, నిర్ణయం తీసుకోవడం చేయలేము.

పదాలతో అనుసంధానం అయిన జ్ఞానం ఆత్మ. అందుకే పదం యొక్క ప్రాముఖ్యత అపారమైనది మరియు భాగవన్నామం యొక్క శక్తి అసమానమైనది.

Series Navigation<< Worshipping Name & Form (Telugu)Thirty-Three Crore Deities (Telugu) >>
Author:
Subscribe to us!
icon

Related Posts