విభజించి పాలించు
శ్రీమజ్జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ నిశ్చలానంద సరస్వతీజీ మహారాజా, పూరీ శంకరాచార్య గారు (మహారాజా గారు) బ్రిటీష్ వారి “డివైడ్ అండ్ రుల్” విధానం అప్పుడు గాంధీజీ ద్వారా, మరియు ఈ కాలంలో ఎలా కొనసాగిందో మనతో పంచుకున్నారు. సాంప్రదాయ వర్ణ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా తప్పుగా చిత్రీకరిస్తున్నారో, ఎలా దుర్వినియోగం చేస్తున్నారో, ఈ క్రింది విధంగా పుజ్యపడ గారు మనకు వివరించారు:
రాజకీయ నాయకులు ప్రజలను తారుమారు చేయడానికి పదాలు ఉపయోగించడంలో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. తమ రాజకీయ లక్ష్యాలను సాధించుకోవడానికి సమాజాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.
ఆ పదాలు ఏమిటి?
సవర్ణ-అసవర్ణ:
అనవసర పోరాటాలకు బీజం వేస్తూ, సవర్ణ (ఉన్నత మూడు వర్ణాలకు చెందినవారు) మరియు అసవర్ణ (చివరి వర్ణముకు చెందినవారు) మధ్య తగాదాలు సృష్టించి ఎన్నికల ముందు ప్రజాధనాన్ని దోచుకుంటారు.
శ్రీరామజీవి-బుద్ధిజీవి:
వారు తమకు ఉన్న ఉద్దేశాలు కోసం శ్రమజీవి మరియు మేధావుల మధ్య విభజనలను సృష్టిస్తారు.
ఆదివాసి-అగంతుక:
ఇటీవలి పరిణామం ఏమిటంటే ఆదివాసులు (మూలనివాసులు) మరియు ఆగంతుకులు (భారతంలో స్థిరపడిన బయటి వ్యక్తులు), ఇది మరో కలకలం సృష్టించింది. ‘ఆదివాసి’ అనేది చాలా తప్పుదారి పట్టించే పదం. తిలక్ గారు కూడా ఈ పదాన్ని వాడారు. ‘ఆదివాసి’ అనే పదం భారతదేశానికి కళంకం. దీని ఉపయోగం వ్యాసుడు మరియు వసిష్ఠుడు మన దేశం యొక్క స్థానిక నివాసులు కాదని మరియు బయటి నుండి ‘ఆర్యలు’గా వచ్చారని సూచిస్తుంది. ఇది ఇతిహాసాన్ని భయంకరమైన తారుమారు చేసినట్టే. ఆర్యలు బయటి నుండి భారతదేశానికి వచ్చారనే వాదనను తిలక్ గారు సమర్థించారు. ఇది బ్రిటీష్ వారు మనకు అందించిన చరిత్ర మరియు “స్వతంత్ర” భారతదేశంలో దీని ప్రభావం కొనసాగుతుంది.
దళిత:
ఈ పదం “అంత్యజ” అనే సాంప్రదాయ పదానికి కొత్త పరిచయం. “అంత్యజుడు” అనేది స్నేహపూర్వక పదం, దీని అర్థం చిన్న సోదరుడు లేదా చివరిగా జన్మించినవాడు అని (అగ్రజుడు అంటే మొదట పుట్టిన లేదా పెద్ద సోదరుడు). ఇది సాంప్రదాయ హిందూ సమాజంలో ఉపయోగించబడినది. అయితే “దళితుడు” అంటే ‘అణచివేయబడినవాడు’ అని అర్థం వస్తుంది (రాజకీయ నాయకులు ప్రవేశపెట్టిన పదం ఇది). అంత్యజ కులంలో ఒకరు కొనుగోలు చేయబడిన రాజా హరిశ్చంద్ర కథను మహారాజాజీ వివరించారు. అంత్యజ కులానికి సంపద, గౌరవం, మరియు అందరితో సోదర బంధం ఉండేది.
హరిజన:
‘హరిజన్’ అనేది తులసిదాస్ గారి ద్వారా దేవుని భక్తులకు ప్రశంసనీయమైన పదంగా ఉపయోగించబడింది.
రామచరితమానస్ లో ఇలా ఉంది –
जिमि हरिजन हियँ उपज न कामा॥5॥
హరి భక్తుని హృదయంలో కోరికలు ఉండవు.
हरिजन जानि प्रीति अति गाढ़ी।14
తను హరి భక్తుడని తెలిసి అమితమైన ప్రేమ కలిగింది.
గాంధీీ ఎటువంటి మార్పు చేశారంటే , ఈరోజు ఎవరనైనా హరిజన్ అని పిలిస్తే, అది ఒక నిర్దిష్ట కులాన్ని సూచించినట్టు.
రాజకీయ నాయకులు సమాజంలో అశాంతి సృష్టించడానికి, ఆపై మనల్ని వాళ్ళకి అనుకూలంగా నియంత్రించడానికి పై పదాలను ఉపయోగిస్తారు.
రాజకీయాన్ని శుద్ధి చేయడం ముఖ్యం. నేటి రాజకీయ నాయకులకు రాజనీతిపై అవగాహన లేదు కానీ మన నాయకులగా మన మధ్య తిరుగుతున్నారు.
వేదాలు మరియు శాస్త్రాల ప్రకారం రాజనీతి మరియు అభివృద్ధి యొక్క నిర్వచనం:
సుసంస్కృతి, సురక్షితమైన, బాగా చదువుకున్న, సుసంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సేవాదృక్పథంతో మరియు అందరి శ్రేయస్సు వైపు మళ్లే వ్యక్తులు మరియు సమాజం యొక్క సృష్టి.