All posts in this series
సజీవ గురువు యొక్క అవసరం
“నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు సజీవ గురువు అవసరమా?” – ఈ ప్రశ్న మన జీవితంలో ఏ దశలోనైనా తలెత్తవచ్చు. కష్టమైన పరిస్తితులు ఎదురుకుంటునప్పుడు , లేదా మనం అంతర్గత అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక పరిణామాన్ని కోరుకోవడం ప్రారంభించినప్పుడు. శ్రీమజ్జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ నిశ్చలానంద సరస్వతీజీ మహారాజ్, పూరీ శంకరాచార్య (మహారాజాజీ), మన పరిణామానికి సజీవ గురువు ఎలా అవసరమో వివరిస్తారు.
ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి, మనకు గురువు అవసరం.
ఉదాహరణకు , మహారాజాజీ విద్యుత్ వినియోగం గురించి చెప్పారు. మనం విద్యుత్ మరియు విద్యుత్ పరికరాలు, ఫ్యాన్లు, లైట్ మొదలైన వాటి వినియోగం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు, దాని గురించి మనకు ఎవరైనా నేర్పించాలి. మనకు బోధించే వ్యక్తి కూడా విద్యుత్ గురించి బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలి మరియు తను కూడా ఒక ఉపాధ్యాయుడిచే స్వయంగా బోధించబడి ఉండాలి. లేకుంటే మనం షాక్‌కు గురై మనల్ని మనం గాయపరచుకోవచ్చు లేదా తీవ్రమైన పరిస్థితుల్లో చనిపోవచ్చు కూడా. విద్యుత్ యొక్క స్వభావాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అదీ ఒక సజీవ వ్యక్తి నుండి మనం దాని గురించి నేర్చుకోవాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మనం వంట ఎలా చేయాలో నేర్చుకోవాలనుకున్నప్పుడు కూడా మనకు సజీవ గురువు అవసరం. ఇక్కడ, మనం అంతిమ సత్యానికి దారితీసే సూక్ష్మ జ్ఞానాన్ని సూచిస్తున్నాము.
ప్రకృతికి మించిన ఆ పరమాత్మ గురించి – నిర్గుణ నిరాకారుడిగా, మరియు సగుణ నిరాకారుడిగా ప్రకృతిని నియంత్రించేవారు లేదా రాముడు, కృష్ణుడు మరియు దుర్గ రూపాలలో ప్రకృతిని క్రమ పరిచే వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము.
సజీవ గురువు లేకుండా పరమ సత్యం గురించి నేర్చుకోగలరని అనుకోవడం అసాధ్యం.