The Matchstick (Telugu)
< 1 minute read
అగ్గిపుల్ల
పూజ్యపాద పూరి శంకరాచార్య గారు అగ్గిపుల్ల ఉదాహరణతో కోపం వంటి మన దుష్ట లక్షణాలపై ఇలా అన్నారు.
అగ్గిపుల్ల నుండి ఉత్పన్నమయ్యే అగ్ని అగ్గిపుల్లని ఖచ్చితంగా కాల్చేస్తుంది.
నిప్పు వేరే వస్తువుని కాల్చినా కాల్చకపోయినా, అది ఖచ్చితంగా అగ్గిపుల్లని కాల్చేస్తుంది. అదేవిధంగా, మన కోపంమరెవరినైనా ప్రభావితం చేయవచ్చు, చేయకపోవచ్చు కానీ అది మనపై ప్రభావం చూపుతుంది.
మన దుష్ట లక్షణాలు మనతో పాటు ఇతరులకు కూడా హాని కలిగిస్తాయి. మనం మన దుష్ట లక్షణాలను హీనమైనవిగా చూడాలి కానీ వాటిని విలువైనవిగా భావించకూడదు.