Bhagavan as Guru (Telugu)
All posts in this series
దేవుడు గురువుగా
ప్రజలు దేవుడిని లేదా దేవుడి యొక్క అవతారాన్ని తమ గురువుగా పరిగణించడం అసాధారణం కాదు. శ్రీమజ్జగద్గురువు శంకరాచార్య స్వామి శ్రీ నిశ్చలానంద సరస్వతీజీ మహారాజా, పూరీ శంకరచార్యులు (మహారాజాజీ) దీని గురించి ఏమి చెప్పారో మనం అర్థం చేసుకుందాం. ఇలా చేయడం మంచిదేనా? అది మనకు ఈశ్వరుడిని పొందడంలో సహాయపడుతుందా? దేవుడు మనకు గురువు కాగలడా?
మహారాజాజీ ఇలా వివరిస్తున్నారు – దేవుని యొక్క ఏదైనా ఒక రూపాన్ని మన గురువుగా పరిగణించినట్లయితే, మన గురువు మనం పొందాలనుకునే ఈశ్వరుడి వలే మన అంతుకి దూరంగా ఉంటారు.
అటువంటి పరిస్థితిలో మనకు ఎవరు మార్గనిర్దేశం చేస్తారు? మనం సమర్థులైన విద్యార్థి అయితే, మనకు సరైన గురువు లాభిస్తారు. గురువు సహాయంచే మనము గోవిందుడిని చేరుకోవచ్చు.
తమ ఉపన్యాసంలో, దేవుడే స్వయంగా గురువుగా మారిన అసాధారణమైన పరిస్థితులను మహారాజాజీ ప్రస్తావించారు.
భగవాన్ శ్రీ కృష్ణుడు గీతలో చెప్పారు
సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ | (గీత 18.66)
సర్వశక్తిమంతుడు మరియు అన్నింటిని ఆదుకునే ప్రభువు అయిన నాకు మీ అన్ని విధులను విడిచి పెట్టి , నన్ను మాత్రమే ఆశ్రయించండి.
ఈశ్వర్: సర్వభూతానాం హృద్దేశేర్జున్ తిష్ఠతి | (గీత 18.61)
అర్జునా, భగవంతుడు అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటారు .
మనం అర్జునుడిలా అదృష్టవంతులైతే, దేవుడు మనకు గురువు అవుతారని పైన పేర్కొన్నది.
కాబట్టి దేవుడు మనకు ఎప్పుడు గురువు అవుతారు?
గీతలో చెప్పినట్లు
శిష్యస్తేయహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ || (గీత 2.7)
నేను మీ శిష్యుడిని. మిమ్ము ఆశ్రయించిన నన్ను ఉపదేశించుము.
భగవాన్ శ్రీ కృష్ణుడే ఉద్ధవాగారికి గురువు అవుతాురు. ఉద్ధవాగారు బృహస్పతిగారి నుండి నీతిశాస్త్రాన్ని నేర్చుకోగా, అర్జునుడికి ఐనట్లు శ్రీ కృష్ణుడు అతనికి గురువు అయ్యారు.
జగదీశ్వరుడే గురువుగా మారిన వ్యక్తులు చాలా తక్కువ. ఇవి చాలా అరుదు.
ఇతరులకు, సంప్రదాయ పరంపర ద్వారా అందుజేసే జగదీశ్వరుడి యొక్క జ్ఞానాన్ని అనుసరించాలి. వారు గోవిందాన్ని పొందేందుకు గురువు యొక్క మార్గదర్శకత్వం తీసుకోవాలి.
భాగవత పురాణంలోని మొదటి శ్లోకం క్రింద పేర్కొన్నది
తేనే బ్రహ్మ హృదా య ఆదికవయే ముహ్యన్తి యత్సూరయః ।
భగవాన్ శ్రీమన్నారాయణుడు, వేదాల జ్ఞానాన్ని బ్రహ్మకు అందజేశాడని అర్థం. బ్రహ్మజ ఆ జ్ఞానాన్ని వశిష్ట ఋషికి జ్ఞానాన్ని అందించారు, ఆ జ్ఞానం మనకు గురువులందరి ద్వారా అందించబడింది. ఈ విధంగా గురుపరంపర ఏర్పడుతుంది.
అందుకే యోగదర్శనంలో మనం సంప్రదాయ గురు పరంపరల వంశం ద్వారా వెతకడం ప్రారంభిస్తే, మూలంలో భగవాన్‌నే మొదటి గురువుగా కనుగొంటామని యోగదర్శనంలో వ్రాయబడింది.
కాబట్టి, ఈశ్వరుడిని పొందే మన ప్రయాణంలో ఒక సాంప్రదాయకమైన పరంపర యొక్క గురువు మనకు మార్గనిర్దేశం చేయగలరు .