Atma as Guru (Telugu)

This entry is part 3 of 9 in the series Guru Series Telugu
< 1 minute read

ఆత్మ మన గురువుగా

పూజ్యపాద  పూరీ శంకరాచార్యజీ గారు (మహారాజాజీగా సూచిస్తారు) మన ఆత్మ మన గురువు అవ్వటం సాధ్యం కాదని చెప్పారు.

మనకు ఆత్మ గురించిన జ్ఞానం లేకపోతే, దానిని మన గురువుగా ఎలా పరిగణించగలం? ఇది కేవలం గురువును చేరుకోకుండా అడ్డుకునే మన అహంకారమే.

గురువు లేకుండా మనం భగవంతుడిని పొందగలమని ఊహించడం అహంకారాన్ని సూచిస్తుంది. గురువు లేకుండా ఏ ఆధునిక జ్ఞానాన్ని కూడా పొందలేము, అలాంటప్పుడు గురువు లేకుండా త్రిలోకాలకు అతీతమైన దాని గురించి మనం ఎలా నేర్చుకోవచ్చు?

తాము మంచివారిమని, సమర్ధులమని చెప్పుకునే వారు, కలియుగంలో తమకు గురువు దొరుకుతారేమోనని సందేహించే వారు, నిజంగా తాము అనుకున్నంత మంచివారైతే, వారికి కూడా గురువు లభిస్తారని తెలుసుకోవాలి.

ఆత్మ గురించి ఏమీ తెలియకుండా మనం ఆత్మను మన గురువుగా ఎలా అనుకోగలము?

గురువు అంటే మనల్ని సరిదిద్ది, మార్గనిర్దేశం చేయగల వ్యక్తిగా ఉండాలి.

మహారాజాజీ గొప్ప పరిపాలకుడు – రాజా భరతుని ఉదాహరణను ఇచ్చారు, అతని పేరు మీద మన దేశానికి ‘భారతదేశం’ అని పేరు పెట్టారు. భాగవతంలోని 5వ మరియు 11వ స్కందములలో ఈ క్రింది విధంగా సూచిస్తారు –

అనేక సంవత్సరాల పాలన తరువాత, భరతుడు తన సింహాసనాన్ని మరియు కుటుంబాన్ని త్యజించి తపస్సుకు వెళ్లాడు. అతను అడవిలో ఉన్న సమయంలో, అతను రక్షించిన ఒక జింక పిల్లను పెంచాడు. ఈ ప్రక్రియలో అతను ఆ జింకతో మానసికంగా దగ్గర అయ్యాడు. అతనికి మార్గదర్శకత్వం వహించే గురువు ఉండుంటే, తన స్వంత పిల్లలను మరియు మనవరాళ్లను విడిచిపెట్టిన తరువాత, అతను జింక పిల్లలను పెంచడంలో నిమగ్నమై, అనుబంధాన్ని పెంచుకుంటే – ఇది అతని పతనానికి కారణం కావొచ్చని చెప్పేవారు. చివరికి అతని ఈ లోతైన అనుబంధం అతని తదుపరి జన్మలో జింకగా జన్మించటానికి దారితీసింది.

గత జన్మలో తమ గురువు నుండి ఉపదేశాన్ని పొంది, తమదైన కొంత ప్రారబ్ధాన్ని పూర్తి చేయడానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే జన్మ తీసుకున్న కొందరికి గురువు అవసరం లేదు.

గురువు లేకుండా భగవంతుడిని పొందగలమని అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము. అలాంటి ఆలోచనకు కారణం మన అహంకారమే.

Series Navigation<< Bhagavan as Guru (Telugu)A Deceased Person as our Guru (Telugu) >>
Author:
Subscribe to us!
icon

Related Posts