All posts in this series
మరణించిన వ్యక్తి మన గురువుగా
పూజ్యపాద పూరీ శంకరాచార్యులు (మహారాజాజీగా సూచిస్తారు) మరణించిన వ్యక్తిని గురువుగా పరిగణించడం ఎలా సాధారణ పద్ధతిగా మారిందో వివరించారు.
ఈ కాలం చాలా మంది శ్రీ రామకృష్ణ పరమహంసను తమ గురువుగా భావిస్తారు. స్వామి వివేకానందకు అతను సజీవ గురువు మరియు అతనికి మార్గనిర్దేశం చేశారు, ఈ రోజు ఆయనను తన గురువుగా భావించే ఎవరైనా ఆయన దర్శనం కూడా చేసుకోలేరు.
ఆ తర్వాత, శ్రీకృష్ణువు, హనుమంతుడు మొదలైన రూపాల్లో దేవుడు తమ గురువుగా భావిస్తామని చెప్పేవారు మరికొందరు.
పైన పేర్కొన్న విధంగా మనం గురువును ఎంచుకున్నప్పుడు (మరణం పొందిన వ్యక్తి లేదా దేవుని యొక్క అవతారం), అప్పుడు మన గురువు కూడా మనం కోరుకునే పరమ సత్యం వలే మనకు అందని దూరంలో ఉంటారు.
మన గురువుని దర్శనం చేసుకోలేనప్పుడు, అందుకోలేనప్పుడు ఆయన మార్గదర్శకత్వం ఎలా పొందగలము?
దీనివల్ల మన లక్ష్యం వైపు వెళ్లడం మరింత కష్టతరం కాదా?
మీ పాఠశాల నుండి విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో చదువుకోవడానికి ప్రయత్నించండి. మరణించిన ఉపాధ్యాయులను చేర్చండి. పుస్తకాలు మీకు ఇచ్చినప్పటికీ, మీ పూర్వ గురువులు తెలివిగలవారు అయినప్పటికీ, చనిపోవాటంచే, వారు ఇకపై మీకు బోధించటం సాధ్యం కాదు.
ప్రజలు తరచుగా తమను తాము సమర్థులైన విద్యార్థులుగా భావిస్తారు కానీ తమ గురువుగా తమకు మార్గనిర్దేశం చేసేంత సామర్థ్యం ఎవరూ లేరని అనుకుంటారు.
ఇది గర్వం నుండి పుట్టిన వైఖరి కాదా?
గురువు అంటే మీకు విద్యాబుద్ధులు నేర్పించగల వ్యక్తి, మీరు అతనిని కలుసుకుని నేర్చుకోగలిగిన వ్యక్తి.
మహారాజాజీ గొప్ప పరిపాలకుడు – రాజా భరతుని ఉదాహరణను ఇచ్చారు, అతని పేరు మీద మన దేశానికి ‘భారతదేశం’ అని పేరు పెట్టారు. భాగవతంలోని 5వ మరియు 11వ స్కందములలో ఈ క్రింది విధంగా సూచిస్తారు –
అనేక సంవత్సరాల పాలన తరువాత, భరతుడు తన సింహాసనాన్ని మరియు కుటుంబాన్ని త్యజించి తపస్సుకు వెళ్లాడు. అతను అడవిలో ఉన్న సమయంలో, అతను రక్షించిన ఒక జింక పిల్లను పెంచాడు. ఈ ప్రక్రియలో అతను ఆ జింకతో మానసికంగా దగ్గర అయ్యాడు. అతనికి మార్గదర్శకత్వం వహించే గురువు ఉండుంటే, తన స్వంత పిల్లలను మరియు మనవరాళ్లను విడిచిపెట్టిన తరువాత, అతను జింక పిల్లలను పెంచడంలో నిమగ్నమై, అనుబంధాన్ని పెంచుకుంటే – ఇది అతని పతనానికి కారణం కావొచ్చని చెప్పేవారు. చివరికి అతని ఈ లోతైన అనుబంధం అతని తదుపరి జన్మలో జింకగా జన్మించటానికి దారితీసింది.
మనకు సజీవ మరియు అందుబాటులో ఉన్న గురువు ఎందుకు అవసరమో ఇది వివరిస్తుంది.